E-PAPER

సింగరేణి నర్సింగ్ స్కూల్‌లో జీఎన్‌ఎం ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మణుగూరు:
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొత్తగూడెం సింగరేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (GNM) కోర్సు ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. మూడేళ్ల కాలపరిమితి కలిగిన ఈ కోర్సులో మొత్తం 20 ఉచిత సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
అక్టోబర్ 23 వరకు గడువు
ఈ కోర్సులో ప్రవేశం పొందాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 9 నుంచి 23వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుమును సర్క్యులర్‌లో నిర్దేశించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చలానా హెడ్ల ద్వారా చెల్లించాలని స్పష్టం చేశారు.
కోర్సు ప్రవేశాలు, కావాల్సిన అర్హతలు, నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం తెలంగాణ వైద్య విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్ dme.telangana.gov.in ను పరిశీలించాలని సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువు ముగిసేలోపే ప్రక్రియను పూర్తి చేయాలని మణుగూరు ఏరియా ఏజీఎం (పర్సనల్) ఎస్. రమేశ్ గారు ఒక ప్రకటనలో వెల్లడించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!