E-PAPER

కష్టపడి చదివి ఉన్నత స్దితికి చేరుకోండి ; తేగడ సర్పంచ్ మురళీకృష్ణ

చర్ల, ఆగస్ట్ 25 ( వై 7న్యూస్ ) : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్దితికి చేరుకోవాలని చర్ల మండలం తేగడ గ్రామ పంచాయతీ సర్పంచ్ జమ్ముల మురళీకృష్ణ అన్నారు. తేగడ గ్రామానికి చెందిన పొన్నపు సంతోష్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా పాకాలపాటి సత్యనారాయణరాజు మిత్రులు చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం/శబరి బాలికా విద్యార్ది నిలయం విద్యార్దులకు భోజన ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అద్యక్షతన జరిగిన సమావేశంలో సర్పంచ్ మురళీకృష్ణ మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన విద్యార్దుల అభ్యున్నతికి విద్యార్ది నిలయం ఏర్పాటు చేయడం అబినందనీయమని అన్నారు. విద్యార్దులు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. విద్యతోనే మానవజాతి మనుగడ ముడిపడి ఉన్నదని, కుటుంబంలో ఒక్కరు చదువుకొని జీవితంలో స్దిరపడితే ఆకుటుంబం మొత్తం స్దిరపడుతుందని పేర్కొన్నారు. ఇక్కడి విద్యార్దులు క్రమ శిక్షణకు మారుపేరుగా నిలిచారని సంస్ద ఆశయాలకు అనుగుణంగా విద్యార్దులు చదువులపై దృష్టిసారించి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వనవాసీ జిల్లా సహ కార్యదర్శి గోగికార్ రాంలక్ష్మణ్, కొమరం భీం సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, తేగడ ఉప సర్పంచ్ రాంప్రసాద్, పాకాలపాటి సత్యనారాయణ రాజు, మద్ది లక్ష్మి నరసింహారెడ్డి, యాసం వెంకటేశ్వర్లు, అంబోజి సతీష్, రామకృష్ణ, మామిడి రాజు, నిలయ ప్రముఖ్ లు వరలక్ష్మి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!