E-PAPER

‘బ్రహ్మాస్త్ర-2’పై క్లారిటీ.. దీపికా పదుకొణె నటించడం లేదన్న టీమ్

అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్న ‘బ్రహ్మాస్త్ర-2’లో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నటించడం లేదని ఆమె టీమ్ స్పష్టం చేసింది. ఈ సినిమాలో దీపిక అమృత పాత్రలో కనిపించనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె టీమ్ వెల్లడించింది.

బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఫాంటసీ అడ్వెంచర్ సిరీస్ ‘బ్రహ్మాస్త్ర’. దర్శకుడు అయాన్ ముఖర్జీ తన ప్రత్యేకమైన విజన్‌తో భారీ బడ్జెట్‌లో ఈ విజువల్ వండర్‌ను తెరకెక్కించారు. తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ 1 – శివ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో రెండో భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

‘బ్రహ్మాస్త్ర-2’లో దీపికా పదుకొణె కీలక పాత్రలో కనిపిస్తారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. అయితే తాజాగా ఆమె టీమ్ ఇచ్చిన క్లారిటీతో ఈ ప్రచారానికి తెరపడింది. సినిమాలో ఆమె నటించడం లేదని స్పష్టం చేయడంతో.. మరి అమృత పాత్రను ఎవరు పోషిస్తారనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!