E-PAPER

‘జగమే సంగీతం’ ట్రైలర్ రిలీజ్.. ప్రకాష్ రాజ్ డైలాగ్స్‌కు ఫిదా అవుతున్న ప్రేక్షకులు

సంగీతం, కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కుతున్న సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘జగమే సంగీతం’. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానున్న ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. హిందీలో సంచలన విజయం సాధించిన ‘బందిష్ బాండిట్స్’కు తెలుగు అడాప్షన్‌గా రూపొందుతున్న ఈ మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామాకు మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

వెటరన్ నటుడు తణికెళ్ల భరణి గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. “ఇదే మన వైకుంఠపురం.. ముప్పై ఏళ్ల తర్వాత సంగీత భారతిని నిర్ణయించే సమయం వచ్చింది” అంటూ ఆయన చెప్పే డైలాగ్ సిరీస్ కథపై ఆసక్తిని పెంచుతోంది. సంగీత ప్రపంచంలోని పోటీ, సంప్రదాయాలు, కుటుంబ భావోద్వేగాలను ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు.

ఇక దిగ్గజ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగులు ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “స్వచ్ఛమైన సంగీతమే నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు.. ఎన్ని పాశ్చాత్య పిల్ల కాలువలు పుట్టుకొచ్చినా.. వాటన్నింటికీ అమ్మ ఈ శాస్త్రీయ సంగీతమే” అంటూ ఆయన చెప్పే తీరు పాత్రలోని గాఢతను ఆవిష్కరిస్తోంది. ప్రస్తుతం ‘జగమే సంగీతం’ ట్రైలర్‌లోని డైలాగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సిరీస్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!