E-PAPER

రోజంతా కూర్చుంటున్నారా? తోక ఎముక దగ్గర వచ్చే ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!

రోజూ ఉదయం కుర్చీలో కూర్చోవడంతో మొదలయ్యే మన పని.. మధ్యాహ్నం, సాయంత్రం కూడా అదే కుర్చీలో కొనసాగుతుంది. కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునే క్రమంలో 8 గంటలు ఎలా గడిచిపోతాయో కూడా తెలియదు. పని పూర్తయ్యాక లేచి నడిచేటప్పుడు నడుము బిగుసుకుపోయినట్లు, మెడ పట్టేసినట్లు, కాళ్లు బరువెక్కినట్లు అనిపిస్తుంది. మరుసటి రోజు మళ్లీ ఇదే రొటీన్‌ కొనసాగుతుంది.

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు అనగానే చాలామందికి నడుము నొప్పి, మెడ నొప్పి, బరువు పెరగడం వంటి సమస్యలే గుర్తుకొస్తాయి. అయితే గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరంలోని మరో సున్నితమైన ప్రాంతంపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా కదలకుండా ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చుంటే తోక ఎముక చుట్టుపక్కల భాగంపై నిరంతర ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది.

తోక ఎముకను వైద్య పరిభాషలో కాక్సిక్స్‌ (Coccyx) అంటారు. ఎక్కువసేపు కూర్చోవడం, ముఖ్యంగా గట్టి కుర్చీలపై సరైన భంగిమ లేకుండా కూర్చోవడం వల్ల ఈ ప్రాంతంలో నొప్పి, అసౌకర్యం లేదా బిగుతు వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి రోజంతా కూర్చునే అలవాటు ఉన్నవారు మధ్యమధ్యలో లేచి నడవడం, కూర్చునే భంగిమను మార్చడం, సరైన సపోర్ట్‌ ఉన్న కుర్చీని ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!