E-PAPER

Vivo V80 Lite 5G: 3,000 నిట్స్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే.. 50MP కెమెరాతో కొత్త ఫోన్!

వివో (Vivo) తన V80 సిరీస్‌లో భాగంగా కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. Vivo V80 Lite 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, MediaTek Dimensity ప్రాసెసర్, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ప్రీమియం డిజైన్‌తో పాటు ఈ డివైస్‌కు IP68, IP69 రేటింగ్స్‌ను కూడా అందించారు.

Vivo V80 Lite 5Gలో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 449ppi పిక్సెల్ డెన్సిటీతో పనిచేస్తుంది. డిస్‌ప్లే గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. కర్వ్డ్ డిస్‌ప్లే కారణంగా ఫోన్ ముందు భాగం ప్రీమియం లుక్‌ను కలిగి ఉండగా.. వెనుక భాగంలో హారిజాంటల్ కెమెరా బార్‌ను అందించారు. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, సిమెట్రికల్ స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే Vivo V80 Lite 5G వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP Sony IMX852 మెయిన్ కెమెరాతో పాటు 2MP బొకే కెమెరాను అందించారు. కెమెరాలకు రింగ్ LED ఫ్లాష్‌ను జత చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ప్రీమియం డిజైన్‌, ఆకట్టుకునే డిస్‌ప్లే, కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్‌ వినియోగదారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!