స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ మరో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. గెలాక్సీ ఎస్26 సిరీస్‌లో భాగంగా ‘Samsung Galaxy S26 FE’ను అత్యాధునిక ఏఐ ఫీచర్లతో పరిచయం చేయనుంది. ఫ్యాన్ ఎడిషన్‌గా రానున్న ఈ ఫోన్‌పై ఇప్పటికే టెక్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ కొత్త డివైజ్ లాంచ్ ఈవెంట్‌ను ఆగస్టు 27న వర్చువల్‌గా నిర్వహించేందుకు శాంసంగ్ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గెలాక్సీ ఎస్26 సిరీస్‌ను, జులైలో జెడ్ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేసిన సంస్థ.. ఇప్పుడు మరో కీలక లాంచ్‌కు సిద్ధమవుతోంది. దీంతో S26 FEలో ఎలాంటి ఫీచర్లు అందించనుందనే దానిపై ఆసక్తి పెరిగింది.
ఆగస్టు 27న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు ఈ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు యూట్యూబ్ ఛానల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఫోన్ ఫీచర్లు, ధర, లభ్యతకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.








