E-PAPER

Poco F9 Pro, F9 Ultra.. త్వరలో పోకో నుంచి రెండు పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరోసారి తన సత్తా చాటేందుకు పోకో సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టెక్ రిపోర్టుల ప్రకారం పోకో బ్రాండ్ నుంచి త్వరలో రెండు కొత్త ప్రీమియం హ్యాండ్‌సెట్లు మార్కెట్లోకి రానున్నాయి. వీటిలో Poco F9 Pro, Poco F9 Ultra మోడళ్లు ఉండనున్నట్లు సమాచారం.

Poco F9 Pro చైనాలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన Redmi K100 Proకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో మరింత శక్తివంతమైన Poco F9 Ultra.. Redmi K100 Pro Max ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. దీంతో ఈ రెండు ఫోన్లపై టెక్ ప్రియుల్లో ఆసక్తి పెరుగుతోంది.

పోకో ఎఫ్9 సిరీస్‌లో హై-ఎండ్ పనితీరు, ప్రీమియం డిజైన్, అధునాతన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అయితే ధర, స్పెసిఫికేషన్లు, భారత మార్కెట్లో విడుదల తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారిక వివరాలు వెల్లడైన తర్వాత ఈ ఫోన్లపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!