‘90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో మౌళీ ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘దొంగ నా కొడుకు’ అనే వినూత్న టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
“Beware… Donga Naa Koduku is here to steal a few laughs” అనే క్యాప్షన్‌తో మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా పూర్తి స్థాయి రాబరీ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నట్లు తెలిపారు. దొంగతనం నేపథ్యంలో సాగే కథకు కామెడీని జోడించి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మౌళీ సరసన సుష్మిత (సుష్షీ) హీరోయిన్గా నటిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సినిమాకు ‘దొంగ నా కొడుకు’ దర్శకత్వం వహిస్తున్నారు. ఆడియో హక్కులను థింక్ మ్యూజిక్ సొంతం చేసుకోగా, ఓవర్సీస్లో ప్రత్యంగిరా సినిమాస్ విడుదల చేయనుంది. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. టైటిల్‌తోనే ఆసక్తి రేపిన ఈ చిత్రం నుంచి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.









