న్యాచురల్ స్టార్ నాని సినీ ప్రయాణం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హీరోగా వరుస విజయాలతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న నాని.. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. 2005లో నితిన్ హీరోగా వచ్చిన ‘అల్లరి బుల్లోడు’ సినిమాకు నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పట్లో కెమెరా వెనుక పనిచేసిన ఆయన.. ఆ తర్వాత తన కష్టంతో హీరోగా అవకాశాన్ని అందుకుని టాలీవుడ్లో న్యాచురల్ స్టార్‌గా ఎదిగారు.
సుమారు రెండు దశాబ్దాల తర్వాత నాని కెరీర్లో మరో ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్న నాని.. నితిన్ హీరోగా తెరకెక్కనున్న ‘అలియాస్ రుక్మిణీ’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు నితిన్ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాని.. ఇప్పుడు అదే హీరో సినిమాను నిర్మించే స్థాయికి ఎదగడం విశేషంగా మారింది.
నాని ప్రయాణంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఇదే నిజమైన సక్సెస్ స్టోరీ”, “కష్టపడితే అసాధ్యం అనేది ఏదీ లేదు”, “అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ హీరో, నిర్మాత వరకు నాని ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కెమెరా వెనుక అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలైన నాని ప్రయాణం.. స్టార్ హీరోగా, నిర్మాతగా కొనసాగడం ఆయన కష్టానికి, పట్టుదలకు నిదర్శనమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.









