ఐక్యూ (iQOO) భారత మార్కెట్లో కొత్త iQOO Z11 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. బడ్జెట్ 5G విభాగాన్ని లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 50MP సోనీ కెమెరా, 6500mAh భారీ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను అందించింది. అంతేకాకుండా AI ఆధారిత ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ కూడా ఇందులో ఉన్నాయి.
iQOO Z11 Lite 5Gలో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1200 నిట్స్ HBM బ్రైట్‌నెస్‌ను అందిస్తుండటంతో ఎండలో కూడా స్పష్టమైన విజువల్స్ కనిపిస్తాయి. ఫోన్‌కు MediaTek Dimensity 6300 (6nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తినిస్తుండగా, గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 GPUను అమర్చారు.
ఈ స్మార్ట్‌ఫోన్ 4GB, 6GB LPDDR4X ర్యామ్ ఆప్షన్లతో పాటు 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మైక్రోSD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై పనిచేసే ఈ ఫోన్‌కు 6GB ర్యామ్ వేరియంట్‌లో 2 సంవత్సరాల OS అప్‌డేట్లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.









