శ్రీకాకుళం జిల్లా పలాస వై7 న్యూస్ | జూలై 22
పలాస–కాశీబుగ్గ పురపాలక కార్యాలయంలో గృహ
నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సమీక్ష సమావేశం
పలాస–కాశీబుగ్గ పురపాలక కార్యాలయంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారధి అధ్యక్షతన గృహనిర్మాణ శాఖకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష, ఇచ్చాపురం శాసనసభ్యుడు శ్రీ బెందాలం అశోక్, ఏపీటీపీసీ చైర్మన్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శ్రీ వజ్జ బాబూరావు పాల్గొన్నారు.
సమావేశంలో పలాస–కాశీబుగ్గ, ఇచ్చాపురం నియోజకవర్గాల పరిధిలో అమలవుతున్న గృహనిర్మాణ పథకాల పురోగతి, నిర్మాణాల వేగవంతం, మౌలిక సదుపాయాల కల్పన, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గృహనిర్మాణ పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నియోజకవర్గానికి సంబంధించిన గృహనిర్మాణ సమస్యలు, స్థానిక ప్రజల అవసరాలు, పెండింగ్ అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధే లక్ష్యంగా అన్ని శాఖల పనితీరును నిరంతరం సమీక్షిస్తూ, అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని సమావేశంలో నాయకులు పేర్కొన్నారు.









