E-PAPER

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం


శ్రీకాకుళం జిల్లా, పలాస, వై7 న్యూస్, జూలై 22:
ఇటీవల పలాసలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గొర్రెల కాపరి దుబ్బ దానయ్య కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెండలం అశోక్ పరామర్శించారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి రూ.5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సహాయం బాధిత కుటుంబానికి కొంత ఊరటనిచ్చే చర్యగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. మంత్రి గారి ఉదారతను ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.

దివంగత దుబ్బ దానయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని పలువురు ఆకాంక్షించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News