అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఆయన భార్య, భారతీయ సంతతికి చెందిన ఉషా వాన్స్ కుటుంబంలో మరోసారి ఆనందం నెలకొంది. ఆదివారం ఉదయం ఉషా వాన్స్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని జేడీ వాన్స్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నారు.
వాన్స్ దంపతులు తమ నాలుగో సంతానానికి అలెక్ నీల్ వాన్స్ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ భావోద్వేగంతో స్పందిస్తూ, “ఈ ఉదయం మా కుటుంబంలోకి అలెక్ నీల్ వాన్స్ వచ్చాడు. ఉషా, బాబు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా ముగ్గురు పిల్లలు తమ తమ్ముడిని కలవడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు” అని పేర్కొన్నారు.
ఈ శుభవార్త వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో జేడీ వాన్స్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, రాజకీయ ప్రముఖులు మరియు అనుచరులు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.
Post Views: 7








