E-PAPER

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా అనురాగ్ కుమార్ బాధ్యతలు.. కేంద్రం కీలక నియామకం

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకు ఆయనను ఈ కీలక పదవికి నియమించారు. 1994 బ్యాచ్‌కు చెందిన అనురాగ్ కుమార్, ఈ నియామకానికి ముందు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో స్పెషల్ డైరెక్టర్‌గా సేవలందించారు.

కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, అనురాగ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఆయన నియామకం అమల్లోకి వచ్చింది. భద్రతా వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న ఆయనకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటివరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సతీష్ గోల్చాను పదవీకాలం ముగియకముందే బాధ్యతల నుంచి తప్పించారు. 1992 బ్యాచ్ AGMUT కేడర్‌కు చెందిన ఆయన 2027 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, పరిపాలనా మార్పుల్లో భాగంగా ముందుగానే రిలీవ్ చేశారు. తదుపరి పోస్టింగ్ కోసం ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు రిపోర్ట్ చేయనున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News