మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న #Chiru158 చిత్రం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘వాల్తేర్ వీరయ్య’ విజయానంతరం మరోసారి ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో కీలకమైన హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను భారీ సెట్స్‌లో చిత్రీకరిస్తున్నారు.
రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎపిసోడ్లో భారీ సంఖ్యలో ఫైటర్లు పాల్గొంటున్నారు. ఇందులో చిరంజీవి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని, మెగాస్టార్ స్వయంగా రిస్కీ స్టంట్లు చేస్తూ షూటింగ్లో పాల్గొంటున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.
మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. చిరంజీవికి జోడీగా అనస్వర రాజన్ నటిస్తుండగా, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను కొన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి రూపొందించగా, భాను–నందు సంభాషణలు అందిస్తున్నారు.








