E-PAPER

శ్రీలంకలో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్..! 8 మంది భారతీయుల అరెస్ట్..

శ్రీలంక రాజధాని కొలంబోలో అక్రమంగా ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై ఎనిమిది మంది భారతీయ పౌరులను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. కొలంబో శివారు ప్రాంతమైన తలవతుగోడలోని ఒక నివాసంలో ఈ గ్యాంబ్లింగ్ నెట్ వర్క్‌ను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

తలంగమ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఈ అరెస్టులు జరిగాయి. కడువెల మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ పొందిన అనంతరం, సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సహకారంతో పోలీసులు ఆ నివాసంపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారంతా 22 నుంచి 51 ఏళ్ల మధ్య వయసున్న భారతీయ పౌరులేనని పోలీసులు ధృవీకరించారు.

దాడి సందర్భంగా ఆ గృహం నుంచి ఆరు కంప్యూటర్లు, 39 మొబైల్ ఫోన్లు, పెద్ద సంఖ్యలో కంప్యూటర్ యాక్సెసరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహణ కోసమే వీటిని వినియోగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

విదేశీయులు పాల్పడుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై శ్రీలంక అధికారులు ఇటీవల కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ అరెస్టులు కూడా అందులో భాగమేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్ ఎంత విస్తరించింది, దీని వెనుక ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!