కరకగూడెం ;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో మొహర్రం పండుగ సందర్భంగా నిర్వహించే జారత్ దావత్ కోసం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ 25 కేజీల బియ్యాన్ని మొహర్రం ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే గ్రామపంచాయతీ సర్పంచ్ పోలేబోయిన సుజాత కూడా 25 కేజీల బియ్యాన్ని అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొహర్రం పండుగ త్యాగం, సహనం, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని మతాల పండుగలను పరస్పర గౌరవంతో జరుపుకోవడం మన సంస్కృతి అని, సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
ఉత్సవ కమిటీ సభ్యులు వారి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
Post Views: 25









