దుమ్ముగూడెం, జూన్ 29:
బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి రవీంద్ర, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి రాంప్రసాద్, మండల మాజీ కార్యదర్శి మానే రామకృష్ణ, మండల నాయకులు రాముడు, జానీ పాషా ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా దుమ్ముగూడెం మండలంలో ఇంటింటి ఓటరు సర్వే చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దుమ్ముగూడెం గ్రామంలోని 107వ పోలింగ్ కేంద్రం పరిధిలో బూత్ స్థాయి ప్రతినిధి బోర పవన్ రెడ్డి, బూత్ స్థాయి అధికారి రోశయ్యతో కలిసి ఓటర్ల వివరాలను పరిశీలించారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు.
ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని నాయకులు సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఓటరు తన బాధ్యతను గుర్తించి సర్వే కార్యక్రమానికి సహకరించాలని కోరారు.









