E-PAPER

పద్మభూషణ్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి ఘన సన్మానం

భద్రాచలం, జూన్ 28 (వై7 న్యూస్):
పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి భద్రాచలంలో ఘన సన్మానం నిర్వహించారు. భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొని డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వైద్య రంగంలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అందించిన విశిష్ట సేవలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. వైద్య రంగంలో ఆయన సాధించిన విజయాలు యువ వైద్యులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ రామేశ్ చంద్ర, డాక్టర్ కాంతారావు, డాక్టర్ క్రాపా విజయ్, డాక్టర్ పవన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడాలి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ శ్రీరామ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ అబ్బినేని శ్రీనివాసరావు, రామారావు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమం అనంతరం డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News