చర్ల, జూన్ 28 (వై7 న్యూస్): తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య చర్ల మండలంలో పర్యటించారు.
ఈ సందర్భంగా సుబ్బంపేట గ్రామానికి చెందిన వాసం ముసలయ్య కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యలకం నరేంద్రను ఆయన నివాసంలో పరామర్శించారు. నరేంద్ర ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
– సీనియర్ రిపోర్టర్ ; రాజేష్ తమ్మళ్ల

Post Views: 97







