భద్రాచలం, జూన్ 28 (వై7 న్యూస్):
భారతరత్న, మాజీ ప్రధానమంత్రి P. V. Narasimha Rao జయంతి సందర్భంగా భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో భద్రాచలంలోని గోదావరి స్నాన ఘట్టాల వద్ద ఘనంగా నివాళులర్పించారు. పి.వి. చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామావజ్జల రవికుమార్ మాట్లాడుతూ, దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పి.వి. నరసింహారావు దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఆర్థిక మంత్రిగా Manmohan Singhను ఎంపిక చేసి నూతన ఆర్థిక, పారిశ్రామిక, విదేశాంగ విధానాలను అమలు చేయడం ద్వారా దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశారని పేర్కొన్నారు.
భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక రంగంలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లడంలో పి.వి. పాత్ర విశిష్టమని, పదవీ విరమణ అనంతరం ఎదురైన కేసుల్లోనూ తన నిజాయితీని నిరూపించుకున్న మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు.
కార్యక్రమంలో కలకోట శ్రీనివాసాచార్యులు, రాయప్రోలు సత్యప్రసాద్ శర్మ, సిరిపురపు అశోక్ కుమార్ శర్మ, మోటుపల్లి వేణుగోపాలాచార్యులు, ఆర్.వి. వీరభద్రశర్మ, ఆర్. మహేష్, బుక్కపట్నం రామాచార్యులు, ఆర్. నగేష్, శ్రీరాం పవన్, చిట్టి వెంకటేశ్వర్లు, నరసింహ శాస్త్రి, కె. సాయి సూర్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.
– జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాజేష్ తమ్మళ్ల








