E-PAPER

ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించాలి: సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట

భద్రాచలం, జూన్ 28 (వై7 న్యూస్):
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసేటప్పుడు ఓటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ సూచించారు. ఆదివారం భద్రాచలం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్‌వోలు, సూపర్వైజర్ల పనితీరును ఆయన పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఎన్యుమరేషన్ ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలని, ఫారాల పూరణలో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

– జిల్లా స్టాఫ్ రిపోర్టర్; రాజేష్ తమ్మళ్ల

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News