పలాస, జూన్ 28 (వై7 న్యూస్):
శ్రీకాకుళం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరాన్ని ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో సుమారు 1.80 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు.
Post Views: 9








