వై 7 న్యూస్ పలాస ;
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 12వ తేదీన స్టేజ్ ప్రోగ్రామ్ చూసేందుకు బంధువుల ఇంటికి వచ్చిన యువకుడు గ్రామంలోని బీసీ రోడ్డు పక్కన ఉన్న సీసీ రోడ్డుపై బుధవారం రాత్రి నిద్రపోయాడు.అదే సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు అతడిని ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు సారవకోట మండలం సవర బజ్జి గ్రామానికి చెందిన సింహాచలం (21)గా పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Post Views: 10








