వై 7 న్యూస్ పలాస ;
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కొండతెంబూరు జాతీయ రహదారిపై గురువారం వేగుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.స్థానికుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వైపు కూరగాయలతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ కేబిన్‌లోనే చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన క్లీనర్‌ను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం.మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Post Views: 7








