E-PAPER

టెక్కలి – నౌపడ రోడ్డుపై ఘోర ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}
వై 7 న్యూస్ పలాస

శ్రీకాకుళం జిల్లా టెక్కలి – నౌపడ రోడ్డులోని మనసాబుపేట వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.వివరాల్లోకి వెళ్తే.. టెక్కలికి చెందిన ధర్మారావు (49) నౌపడ వైపు నుంచి వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం.మృతుడు ఎర్రంనాయుడు నీటిపారుదల విభాగంలో కాంట్రాక్ట్ వర్క్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంతో చిన్న చాకలి వీధిలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న టెక్కలి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News