E-PAPER

పి.ఓ.డబ్ల్యూ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

వై 7 న్యూస్ పలాస

ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యూ) రాష్ట్ర 9వ మహాసభలను విజయవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం పిలుపునిచ్చింది. సోమవారం పలాస మండలం బొడ్డపాడు గ్రామంలోని అమరవీరుల స్మారక భవనంలో మహాసభల పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ఈశ్వరమ్మ మాట్లాడుతూ దేశంలో మహిళలపై అత్యాచారాలు, గృహహింసలు పెరుగుతున్నప్పటికీ మహిళల రక్షణలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని విమర్శించారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం సంఘటిత పోరాటం అవసరమని ఆమె పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News