ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాల పోస్టర్‌ను కళాశాల ప్రిన్సిపాల్ దొడ్డి భద్రయ్య , సమితి సింగారం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గాండ్ల సురేష్ , మరియు 5వ వార్డు సభ్యులు కొలపిని మానస ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు విద్యాభివృద్ధి మరియు కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చేస్తున్న కృషిని అభినందించారు.ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో శ్రమిస్తున్న ఎమ్మెల్యే వెంకటేశ్వర్లుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Post Views: 15








