భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రంగాపురం గ్రామంలో అనుమానాస్పద ఘటన కలకలం రేపింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల గేట్ ఎదురుగా ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
సోమవారం ఉదయం స్కూల్ వద్దకు వచ్చిన గ్రామస్థులు గేట్ ఎదురుగా నిమ్మకాయలు, బొగ్గు, కొబ్బరికాయలు మరియు ఇతర వస్తువులు ప్రత్యేకంగా అమర్చిన పరిస్థితిని గమనించి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.పిల్లలు చదువుకునే పాఠశాల వద్ద ఇలాంటి చర్యలు జరగడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Post Views: 146








