వై 7 న్యూస్ పలాస
ఎమ్మెల్యే గౌతు శిరీష చేతుల మీదుగా ప్రారంభం
పలాస: పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బుధవారం ఎమ్మెల్యే గౌతు శిరీష దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే శక్తి పథకంను ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మహిళల కోసం అమలులో ఉన్న మహిళ శక్తి పథకం ద్వారా దివ్యాంగ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని చెప్పారు.
అలాగే, నేటి నుంచి 40 శాతం అంగవైకల్యం కలిగిన పురుషులు కూడా ఈ పథకానికి అర్హులని ఆమె పేర్కొన్నారు. ఈ నిర్ణయం దివ్యాంగుల జీవితంలో కీలక మార్పు తీసుకురావడంలో సహాయపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వజ్జ బాబురావు తదితరులు పాల్గొన్నారు
Post Views: 12








