E-PAPER

మహిళల హక్కుల రక్షణకు ఐకమత్యం అవసరం : PWO రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి

వై 7 న్యూస్ | పలాస

మహిళల హక్కులను సమర్థంగా రక్షించాలంటే మహిళలంతా ఐకమత్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని PWO రాష్ట్ర సంఘం అధ్యక్షురాలు లక్ష్మి అన్నారు.
శ్రీకాకుళం జిల్లా జనరల్ బాడీ సమావేశం పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సమాజంలో మహిళలను ప్రభావితం చేస్తున్న డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ మోసాలు, మహిళా చట్టాలు, మద్యపానం వల్ల జరుగుతున్న కుటుంబ, ఆర్థిక మోసాలపై మహిళల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.
ఈ సమావేశం అనంతరం సంఘానికి సంబంధించిన నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News