E-PAPER

లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో ముసలం… భగ్గుమన్న విబేధాలు

మణుగూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో అంతర్గత విబేధాలు తీవ్ర రూపం దాల్చాయి. తొలకాల కేటాయింపుల విషయంలో నెలకొన్న తేడాలపై ఒకే వ్యక్తికి వరుసగా కేటాయింపులు జరగడంపై అసోసియేషన్ ప్రశ్నించగా ఈ విషయంపై వాట్సప్‌లో బూతులతో వాయిస్ మెసేజ్‌లు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఓ సభ్యుడు రెచ్చిపోయి అసోసియేషన్‌లోని మిగతా సభ్యులను బూతులతో దూషించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.

తొలకాల పైనే పెత్తనం సభ్యుల్లో అసహనం

ఒక వ్యక్తి తనకే అనుకూలంగా తొలకాలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తోండని, న్యాయంగా పంచాలని అసోసియేషన్ డిమాండ్ చేయడంతో ఈ వివాదం ముదిరిందని అసోసియేషన్ నాయకులు వై 7 న్యూస్‌కు తెలిపారు.
బొగ్గు తొలకాలు రాకపోవడంతో లారీ యజమానులు లబోదిబో అవుతున్నారని సభ్యులు వాపోయారు.

పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయతీ

వాట్సప్‌ గ్రూపులో ప్రారంభమైన ఈ బూతుల పర్వం, చివరకు మణుగూరు పోలీస్ స్టేషన్ వరకు చేరింది. అసోసియేషన్ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News