వై 7 న్యూస్ పలాస
భువనేశ్వర్–విశాఖపట్నం రైల్వే మార్గంలో కీలక కేంద్రంగా ఉన్న పలాస రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, మహిళలు, సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ గత కొన్ని రోజులుగా పనిచేయడం లేదు.
లిఫ్ట్ పనిచేయకపోవడంతో ప్లాట్‌ఫాం మార్పుల సమయంలో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు విషయం తెలియజేసినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మెట్లు ఎక్కడం ఇబ్బందిగా మారడంతో వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు, భారీ సామాన్లు తీసుకువెళ్తున్న వారు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.
రైల్వే అధికారులు వెంటనే స్పందించి లిఫ్ట్ పనితీరును పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
Post Views: 53









