– బస్సులో దొరికిన 20 వేలు నగదు కలిగిన పర్సును కండక్టర్ కి అందజేత.
బూర్గంపహాడ్ నవంబర్ 30 :- బూర్గంపహాడ్ మండలంలో ప్రజాతంత్ర దినపత్రిక లో పాత్రికేయుడుగా పనిచేస్తున్న తేజావత్ గాంధీ తన నిజాయితీని చాటుకున్నారు…. కొత్తగూడెం నుండి మణుగూరు వెళ్ళే బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో తనకు దొరికిన ఓ పాత్రికేయుడి కి చెందిన నగదు కలిగిన పర్సును బస్సు కండక్టర్ కి అందజేశారు. పర్సులో 20వేల నగదుతో పాటు ముఖ్యమైన ఏటీఎం కార్డ్స్ వివిధ రకాల కార్డులు సైతం ఉన్నాయి. జర్నలిస్టు మానవత్వం చాటుకోవడంతో బస్సు ప్రయాణికులు, స్థానికులు తన నిజాయితీని చాటుకున్న పాత్రికేయుడు గాంధీ నిబద్ధత కలిగిన జర్నలిస్టు అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Post Views: 122









