E-PAPER

పలాసలో ఏపీఎన్జీవో అధ్యక్షులు బోనేల గోపాల్‌కు ఘన సత్కారం

పలాసలో రెండోసారి ఏకగ్రీవంగా ఏపీఎన్జీవోస్ అధ్యక్షులుగా ఎన్నికైన బోనేల గోపాల్‌ను జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. శ్రీనివాస్ నగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో APTF, UTF, PRTU ఉపాధ్యాయ సంఘాలు, గ్రీన్ ఆర్మీ సభ్యులు మొక్కను అందించి అభినందనలు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఇరిగేషన్ అధికారి పొట్నూరు శ్రీనివాసరావును కూడా ఈ సందర్భంలో సత్కరించారు.

పదవులు వచ్చేకొద్దీ బాధ్యత మరింత పెరుగుతుందని, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాలు అత్యంత ఆనందాన్ని ఇస్తాయని గోపాల్ అన్నారు. యువత పర్యావరణ రక్షణ దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు ఆస్పన మధుబాబు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు దుంపల కృష్ణమూర్తి, అంబలి కృష్ణారావు, బల్ల చిట్టిబాబు, కిషోర్ పాత్రో, ఉపాధ్యాయులు దాసరీ శ్రీనివాసరావు, గేదెల జగదీశ్వర్ రావు, బీరప్పారావు, పలాస యూత్ అసోసియేషన్ నక్క అనిల్ కుమార్, రైల్వే ఉద్యోగి డి.దామోదర్, గ్రీన్ ఆర్మీ సభ్యులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News