కరకగూడెం :
కరకగూడెం మండలం పడిగాపురం గ్రామంలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో విద్యాసామగ్రి పంపిణీ జరిగింది. ప్రధాన అతిథిగా పాల్గొన్న ఎంబీబీఎస్ డాక్టర్ షేక్ మస్తాన్ హుస్సేన్, విద్య అనేది సమాజంలో చీకటిని తొలగించే శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. సుమారు 50 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, స్టేషనరీ అందజేశారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంపొందించడం అవసరమని ఆయన సూచించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
Post Views: 160









