మణుగూరు | నవంబర్ 25 ;
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మణుగూరులో బీసీ సంఘాలు నిర్వహించిన నిరసన ర్యాలీ ఆగ్రహంతో, ఆవేదనతో కదిలింది. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలతో, రాష్ట్ర కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వందలాది బీసీ నాయకులు పాల్గొన్నారు.
నిరసనకారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా హెచ్చరిస్తూ,“42% రిజర్వేషన్ ఇవ్వకపోతే… మీ ప్రభుత్వాలను కూల్చేస్తాం!” అని గట్టిగా నినాదాలు చేశారు.నాయకులు 46 జిఓ ఉపసంహరణ, బీసీలకు పూర్తి 42% రిజర్వేషన్ అమలు, రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.జై బీసీ నినాదాలతో మారుమోగిన ర్యాలీలో మహిళా, యువ నాయకులు కూడా భారీగా పాల్గొన్నారు.
Post Views: 42









