మఠంపల్లి మండలం:
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామం
జిల్లాలోనే రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న గ్రామం అయినప్పటికీ, ఇప్పటివరకు సర్పంచ్ పదవికి ఎస్సీ రిజర్వేషన్ ఒక్కసారి కూడా అమలు కాలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మట్టపల్లి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ కులానికి చెందిన ప్రజలు సర్పంచ్ పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ, రిజర్వేషన్ మాత్రం తమ గ్రామాలకు రాకుండా మళ్లిస్తుండటం నిరాశ కలిగిస్తోందని నాయకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ RDO గారికి వినతి పత్రం సమర్పించారు. వినతి స్వీకరించిన ఆర్డీవో
ఈ అంశంపై కలెక్టర్ తో చర్చిస్తాను అని హామీ ఇస్తూ రీసీవ్డ్ కాపీ జారీ చేశారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో MRPS మండల అధ్యక్షులు ఇరుగు ప్రభు,మట్టపల్లి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కొత్తపల్లి ఇమ్మానుయేలు తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.









