E-PAPER

అంబుగం–బొద్దులూరు రహదారిపై ఎలుగుబంట్ల సంచారం

మందస మండలం | వై 7 న్యూస్ పలాస

మందస మండలం అంబుగం–బొద్దులూరు రహదారిపై మంగళవారం ఉదయం మూడు ఎలుగుబంట్లు కనిపించడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.ఎలుగుబంట్లు కొంతసేపు రహదారిపై తిరగడంతో వాహనాల రాకపోకలు కొన్ని నిమిషాలు నిలిచిపోయాయి. రహదారిపై ప్రయాణిస్తున్న ప్రజలు అప్రమత్తంగా నిలబడడంతో చిన్నపాటి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఈ నేపథ్యంలో గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.ఎలుగుబంట్లకు దగ్గరగా వెళ్లకూడదని,అవసరమైతే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News