E-PAPER

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

బూర్గంపాడు | Y7NEWS

రిపోర్టర్: మేకల జ్యోతి

బతుకుదెరువు కోసం నడుపుకుంటున్న కిరాణా షాపే ఆమెకు శాపంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టినగరం గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్న విషాద సంఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచింది.

పినపాక పట్టినగర్‌కు చెందిన మేకల రమాదేవి కిరాణా షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. యథావిధిగా ఉదయం షాపు తెరవడానికి వెళ్లిన ఆమె, షాపు తలుపు పట్టుకునే సరికి అందులో విద్యుత్తు ప్రవహించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తీవ్ర షాక్‌తో రమాదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్ర‌మాద‌వ‌శాత్తు షాపులో విద్యుత్ లీకేజ్ జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళ్లముందే రమాదేవి మరణించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్రంగా విలపిస్తున్నారు. ఈ అకస్మాత్ మరణం గ్రామంలో విషాద వాతావరణం నింపింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News