పలాస
పలాస కేంద్రంగా ఉద్దానం ప్రాంతాన్ని జిల్లా గా ఏర్పాటు చేయాలనే డిమాండ్ సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వం పలాసను జిల్లా చేస్తామని ప్రకటించినప్పటికీ, చివరకు కేవలం రెవెన్యూ డివిజన్ గా మార్చి వదిలేయడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
పలాసతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు కూడా జిల్లా ఏర్పాటులో భాగం కాకపోవడంతో ఎన్నో పరిపాలనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా పలాస జిల్లా ఏర్పడుతుందనే ఆశలు ప్రజల్లో నెలకొన్నాయి.
అయితే తాజాగా జరుగుతున్న చర్చల్లో పలాస జిల్లా అంశం ప్రస్తావనకే రాకపోవడంతో, “పలాస జిల్లా లేనట్టేనా?” అని స్థానిక ప్రజలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.
ప్రజలు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ డిమాండ్ ఎప్పుడు నెరవేరనుందో ఇంకా స్పష్టత రాలేదు.
Post Views: 66









