E-PAPER

పేదరికం నుంచి వచ్చిన సేవామూర్తి…

మొరంపల్లి బంజర యువకుడు శనగ మల్లేష్ ఆదర్శం
బూర్గంపాడు;
రిపోర్టర్ |మేకల జ్యోతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన యువకుడు శనగ మల్లేష్ (B.Tech – Electrical) సేవాభావానికి ప్రతీకగా నిలుస్తున్నాడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన, పేదరికం అనుభవించిన కారణంగా సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.కరోనా సమయంలో రోజువారీ కూలీల కోసం 125 కుటుంబాలకు రూ.45,000 విలువైన నిత్యావసర సరుకులు అందించడంలో మల్లేష్ కీలక పాత్ర పోशించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికీ స్వయంగా, అలాగే ‘చేయూత’, ‘నేస్తం’ ట్రస్టుల సహకారంతో సహాయాలు అందిస్తున్నారు.తన కాలనీలో లేబర్ ఇన్సురెన్స్, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు చేయించి అనేక కుటుంబాలకు తోడుగా నిలిచారు. యువత క్రీడల అభివృద్ధికి వ్యక్తిగతంగా ప్రోత్సాహం అందిస్తున్నారు.డబ్బుకన్నా మంచి మనసే ముఖ్యమని నిరూపిస్తున్న శనగ మల్లేష్, తన సేవాభావంతో ప్రజల ఆదరణను పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News