కొత్తగూడెం;
రిపోర్టర్ | మేకల జ్యోతి ;
జల్ సంచయ్–జన్ భాగీధారి జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ను రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు మంగళవారం ఘనంగా సన్మానించారు.
కొత్తగూడెం క్లబ్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ను, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తో కలిసి శాలువా, బొకేలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయం చైర్మన్ పసుపులేటి వీరబాబు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొండం వెంకన్న గౌడ్, వై. వెంకటేశ్వరరావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
Post Views: 37









