కార్గో భూతం పేరిట ఉద్ధానం ప్రాంతాన్ని విధ్వంసానికి గురిచేయాలని చూస్తున్నారనే తీవ్ర ఆరోపణలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంపై ప్రజాప్రతినిధులనే ప్రశ్నిస్తూ జిల్లా సీపీఎం పార్టీ కార్యదర్శి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకర మాధవరావు బుధవారం పలాసలో ఏర్పాటైన సమావేశంలో మండిపడ్డారు.
కొమర వాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ..“మా సమస్యలను ఆర్డీవోకు తెలియజేయడానికి వెళ్లినప్పుడు పోలీసులు అనవసరంగా అడ్డుకున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Post Views: 48









