బాల్య వివాహాల నిర్మూలన… మనందరి బాధ్యత
మణుగూరు;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ ఆధ్వర్యంలో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మణుగూరు లో జరిగిన ఈ కార్యక్రమంలో బి సి వెల్ఫేర్ ప్రిన్సిపాల్ ఎం. సరిత, జెడ్ పి పి ఎస్ హెడ్మాస్టర్ నాగశ్రీ , పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా, ఎయిడ్ సంస్థ ప్రతినిధి నాగుల జ్యోతి మాట్లాడుతూ,బాల్యవివాహాలు లేని తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందంజలో నిలవాలి,” అని పిలుపునిచ్చారు.ఆడపిల్లల సర్వతోముఖాభివృద్ధికి బాల్యవివాహాలు పెద్ద అడ్డంకి అవుతున్నాయని పేర్కొన్నారు.
బాల్యవివాహాలు నిర్వహించే వారు, నిర్వహించేవారిని ప్రోత్సహించే వారు కూడా చట్టపరంగా శిక్షార్హులని హెచ్చరించారు.
పిల్లల భద్రతకు సంబంధించిన ఏ సమస్య గానీ అత్యవసర పరిస్థితి గానీ గమనించిన వెంటనే 24 గంటలు పనిచేసే చైల్డ్ లైన్ 1098 కు సమాచారం ఇవ్వాలని కోరారు.అలాగే జిల్లాలోని స్వయం సహాయక బృందాలు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాలు ఈ ప్రచారోద్యమంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు.మహిళలు ముందుకు వస్తే సమాజంలో ఏ మార్పైనా సాధ్యం అని నాగుల జ్యోతి అన్నారు.బాల్యవివాహాల నిర్మూలనపై జరిగిన ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమం స్థానిక ప్రజల్లో మంచి స్పందనను కలిగించింది.









