E-PAPER

సత్తుపల్లిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

సత్తుపల్లి;
సత్తుపల్లి పట్టణం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మెయిన్ రోడ్ వద్ద దేశ అభివృద్ధికి బంగారు బాటలు వేసిన మహనీయురాలు, భారత తొలి మహిళా ప్రధానిగా అమూల్యమైన సేవలు అందించిన ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా, ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఇందిరాగాంధీ నాయకత్వం, దూరదృష్టి, దేశ పట్ల ఉన్న అపారమైన నిబద్ధత గురించి స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజలా రాణి, మాజీ కౌన్సిలర్ దూదిపాల రాంబాబు, సీనియర్ నాయకులు కమల్ పాషా, ఐ. శ్రీను, సామెలు, మహిళా నాయకులు కుమారి, సరోజినీ, అలాగే సత్తుపల్లి పట్టణ మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News