కామేపల్లి;
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానిగూడెం గ్రామంలో భారత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాధాత్ బాబు నాయక్, గ్రామ అధ్యక్షుడు కీసర నరసింహారెడ్డి నాయకత్వం వహించారు.
ఇందిరమ్మ సేవలను స్మరించుకుంటూ గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు పూలమాలలు సమర్పించి నిమ్మళంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేశ అభివృద్ధికి చేసిన సేవలను, పేదల సంక్షేమానికి తీసుకువచ్చిన పథకాలను నాయకులు స్మరించుకున్నారు.
కార్యక్రమంలో ప్రభుదాస్, ఎనమది నరసింహారావు, ప్రసాద్, ఎల్లంకి నవీన్, మహిళా నాయకురాలు విజయలక్ష్మి, వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
Post Views: 50









