అశ్వాపురం మండల పోలీసులు సైబర్ క్రైమ్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు సైబర్ నేరగాళ్లు ఉపయోగించే పద్ధతులు, ప్రమాదాలు, జాగ్రత్తలు గురించి వివరించారు.
పోలీసులు ఆటో స్టాండ్ వద్దే సమావేశం ఏర్పాటు చేసి డ్రైవర్లకు “అపరిచిత లింకులు క్లిక్ చేయొద్దు… వ్యక్తిగత వివరాలు, OTP, బ్యాంక్ సమాచారం ఎవరికీ ఇవ్వొద్దు… QR కోడ్ స్కాన్ చేయడం వల్ల డబ్బులు పోతాయి” వంటి కీలక సూచనలు చేశారు.
తాజాగా పెరుగుతున్న ఆన్‌లైన్ లోన్స్ యాప్స్, ఫిషింగ్ కాల్స్, ప్రైజ్ మనీ మోసాలు, సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ వంటి అంశాలపై ఉదాహరణలతో వివరిస్తూ, ఏదైనా అనుమానాస్పద పరిస్థితి ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ప్రజల భద్రత కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తామని అశ్వాపురం పోలీసులు తెలిపారు.









