మణుగూరు, నవంబర్ 13 (వై 7 న్యూస్):
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (BTPS) స్థాపన సందర్భంగా భూములు కోల్పోయి, ఇప్పటివరకు ఉద్యోగాలు పొందని ఆదివాసి భూ నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృక్పథంతో మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చందా లింగయ్య దొర ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (VTDA) సొసైటీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మణుగూరు మరియు పినపాక మండల ప్రజలకు ఈ సొసైటీల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి (PO) కి వినతిపత్రం సమర్పించి, సొసైటీ ఏర్పాటుకు కావలసిన పత్రాలను అందజేశారు.
చందా లింగయ్య దొర మాట్లాడుతూ, “భూములు కోల్పోయిన ప్రతి ఆదివాసి కుటుంబం స్వావలంబన సాధించేందుకు ఈ సొసైటీలు వేదికగా నిలుస్తాయి. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి రంగాల్లో వారికి మార్గం సుగమం చేస్తాయి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా అధ్యక్షులు గొగ్గల ఆర్కే దొర, జిల్లా కార్యదర్శి పూణెం జయగోపాల్, పినపాక మండల అధ్యక్షులు కొమరం శ్రీను తదితరులు హాజరయ్యారు.
అదేవిధంగా BTPS ఆదివాసి భూ నిర్వాసితుల సమితి అధ్యక్షులు కుంజ వెంకటరమణ, సభ్యులు పూణెం విజయలక్ష్మి, ఏనిక మంగమ్మ, ఏనిక రజిని, తునికి సుజాత, బొగ్గం సమ్మక్క, వాగబోయిన వినోద్, చిడెం ఉషారాణి, పూణెం ఉష, సోడే సారమ్మ, పర్శిక వెంకటేశ్వర్లు, పండ నరసయ్య, మడకం శ్రీను, మండారి సతీష్, తాటి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసి అభ్యున్నతి కోసం సామాజిక దృక్పథంతో ముందుకు వస్తున్న చందా లింగయ్య దొర ను స్థానిక ఆదివాసి సంఘాలు అభినందించాయి.









